సాకీ :
ఎప్పటికీ తన గుప్పెట విప్పదు ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణముండదు చిక్కులలో పడడం తనకేం సరదా పల్లవి : బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా నిన్న మొన్నా నీ లోపలా కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని నీకైనా కాస్తయినా అనిపించిందారా ఎప్పటికీ చరణం : 1 ఏదోలా చూస్తారే నిన్ను వింతలా నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూవుంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా ॥ చరణం : 2 నీ తీరే మారింది నిన్నకీ నేటికీ నీ దారే మళ్లుతోందా కొత్త తీరానికి మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించక ముందే ఎవరెవరో చెబుతూవుంటే నమ్మేదెలా వెళ్లే మార్గం ముళ్లుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా బదులు చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011) రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : కార్తీక్, సాకీ : మల్లికార్జున్ |
Sunday, July 10, 2011
Mr. Perfect
Subscribe to:
Post Comments (Atom)
ఎప్పటికీ తన
No comments:
Post a Comment